ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. తొలి పోస్ట్ ఏంటంటే..!
Advertisement
- తన కొత్త పుస్తకం తొలి కాపీని పంచుకున్న సోనియా
- ప్రేమ, బాధ్యత, నష్టాలు, తనకంటూ ఓ స్థానం వెతుక్కున్న ప్రయాణం అని వ్యాఖ్య
- పుస్తకంలో రాజీవ్ గాంధీతో పరిచయం, వివాహం ప్రస్తావన
- నవంబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల
Advertisement
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. తన రాబోయే పుస్తకం ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ అభిమానులతో పంచుకున్నారు. ప్రేమ, బాధ్యత, నష్టాలు, తనకంటూ ఓ స్థానం వెతుక్కున్న ప్రయాణం ఇందులో ఉంటుందని వెల్లడించారు. ఈ పుస్తకం నవంబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
544 పేజీల ఈ పుస్తకంలో సోనియా తన వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను వివరించనున్నారు. 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో విద్యార్థినిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీని కలుసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. 1968లో వీరి వివాహం జరిగింది. అనంతరం సోనియా భారత్‌కు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఇటలీలో గడిపిన రోజులు, నెహ్రూ-గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టడం, అత్త ఇందిరా గాంధీతో పరిచయం, భారతీయ జీవనశైలికి అలవాటు పడిన తీరును ఈ పుస్తకంలో ప్రస్తావించారు.